Updated : 07/11/2021 16:22 IST

ఆమె జుట్టుకు రూ.2.61కోట్లు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళలకు జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంత అందంగా కనిపిస్తారని అంటుంటారు. అందుకే ఆడవాళ్లు జుట్టును పెంచుకోవడానికి ఇష్టపడతారు. మాంచెస్టర్‌కు చెందిన మోడల్‌ కత్రినా డెమర్స్‌ కూడా తన జుట్టును గత పదేళ్లుగా పెంచుకుంటోంది. దీంతో ఆమె కురులు 4 అడుగుల 10 అంగుళాల పొడవు పెరిగాయి. ఒత్తుగా.. దృఢంగా ఉండే జుట్టుతో చేసుకున్న రకరకాల హెయిర్‌స్టైల్స్‌ను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తోంది. దీంతో కేవలం కత్రినా జుట్టును చూడటానికే వేలమంది నెటిజన్లు ఆమె ఇన్‌స్టా ఖాతాను ఫాలో అవుతున్నారు. అంతేకాదు.. కొంతమంది తన జుట్టును తాకేందుకు అనుమతించాలని, ఇందుకు ఎంత డబ్బైనా ఇస్తామని ఆఫర్‌ చేస్తుంటారని చెబుతోందామె.  

ఇటీవల కత్రినాకు జర్మనీకి చెందిన ఓ వ్యాపారవేత్త బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఆ జుట్టును కత్తిరించి ఇస్తే రూ.2.61కోట్లు ఇస్తానని చెప్పాడట. కానీ ఆ ఆఫర్‌ను కత్రినా సున్నితంగా తిరస్కరించిందట. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. జుట్టును పెంచుకోవడం అంటే తనకు ఎంతో ఇష్టమని, మొక్కలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. కురులను సైతం అంతే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పుకొచ్చింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని