జంతు సంరక్షకుడు.. పాముల ప్రాణదాత!

మూగజీవాలపై అపారమైన ప్రేమ ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ జంతువులను రక్షించడమే వృత్తిగా పెట్టుకునేవాళ్లు చాలా అరుదు

Updated : 23 Nov 2022 10:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూగజీవాలపై అపారమైన ప్రేమ ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ జంతువులను రక్షించడమే వృత్తిగా పెట్టుకునేవాళ్లు చాలా అరుదు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో కర్ణాటక విజయనగర జిల్లా, ఇంగళకి గ్రామానికి చెందిన వేణుగోపాల్‌ ఒకరు. జంతువుల సంరక్షణనే వృత్తిగా మలచుకున్న అతడు.. సుమారు 25వేల పాములు, మెుసళ్లు, ఎలుగుబంట్లు తదితర ప్రాణాంతక జీవులను రక్షించాడు. 30 ఏళ్లుగా వీటిని పట్టుకుని కాపాడే క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు. పలుమార్లు పాము కాటుకు గురయ్యానని తెలిపాడు. వాటిదోవన వాటిని పోనిస్తే పాములు ఎలాంటి హాని చేయవని, మూగ జీవాలను రక్షించడాన్ని అందరూ తమ బాధ్యతగా భావించాలని కోరుతాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని