Viral Video: కర్వాచౌత్ రోజున ప్రియురాలిని షాపింగ్‌కు తీసుకెళ్లి.. భార్యకు అడ్డంగా దొరికి..!
కర్వాచౌత్ రోజున ఓ ప్రబుద్ధుడు ప్రియురాలితో కలిసి షాపింగ్‌కు వచ్చాడు. ఆ రోజు అతడి భార్య కూడా తన తల్లితో కలిసి అదే మార్కెట్‌కు వచ్చింది.
దిల్లీ: కర్వాచౌత్ రోజున ప్రియురాలితో షాపింగ్ చేస్తోన్న ఓ వ్యక్తికి అనుకోని పరిస్థితి ఎదురైంది. అక్కడికి వచ్చిన భార్యకు అడ్డంగా దొరికి, బుక్కయ్యాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఘజియాబాద్ మార్కెట్‌లో ఈ దృశ్యం చోటుచేసుకుంది.
కర్వాచౌత్ రోజున ఓ ప్రబుద్ధుడు ప్రియురాలితో కలిసి షాపింగ్‌కు వచ్చాడు. అతడి భార్యతో గొడవ కావడంతో ఆమె పుట్టింట్లో ఉంటుంది. అయితే ఆ రోజు ఆమె, తన తల్లితో కలిసి అదే మార్కెట్‌కు వచ్చింది. అక్కడ వేరే మహిళతో ఉన్న భర్తను చూసి, ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ మార్కెట్‌లో అందరిముందే అతడి కాలర్ పట్టుకొని వాయించింది. ఆమె తరఫువారు కూడా అతడి పనిపట్టారు. అడ్డుగా వచ్చిన ప్రియురాలికి కూడా వారి చేతిలో దెబ్బలు తప్పలేదు. రద్దీ మార్కెట్‌లో గొడవ జరగడంతో చాలామంది అక్కడ గుమిగూడారు. బయటకు వెళ్లి మీ గొడవ చూసుకోవాలని యజమాని వారికి గట్టిగా చెప్పాడు. కాగా, దీనిపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త క్షేమం కోరుతూ చేసుకొనే కర్వాచౌత్ పండగ షాపింగ్‌లో ఈ గొడవ చేసుకోవడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు
-
Crime News
Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి
-
India News
Nirmala Sitharaman: చిన్నారి మోములో చిరునవ్వు కోసం..
-
Ap-top-news News
Vande Bharat Express: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...
-
India News
Ramayanam: 530 పేజీల బంగారు రామాయణం!
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..