రెండు మేకలు.. ధర ₹4.5లక్షలు!
మేక మాంసం కాస్త ఖరీదేక్కువ. ప్రాంతాలను బట్టి.. కేజీకి రూ. 700కుపైగా పలుకుతుంటుంది. ఇక మేకను మొత్తంగా కొనుగోలు చేస్తే ధర రూ. వేలల్లో ఉంటుంది. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు మేకలు ఏకంగా రూ.4.5లక్షలకు అమ్ముడుపోయాయి. బక్రీద్ సందర్భంగా ఓ వ్యక్తి లఖ్‌నవూలోని గోమతి నది సమీపంలో
లఖ్‌నవూ: మేక మాంసం కాస్త ఖరీదు ఎక్కువ. ప్రాంతాలను బట్టి.. కేజీకి రూ. 700కుపైగా పలుకుతుంటుంది. ఇక మేకను మొత్తంగా కొనుగోలు చేస్తే ధర రూ.వేలల్లోనే ఉంటుంది. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు మేకలు ఏకంగా రూ.4.5లక్షలకు అమ్ముడుపోయాయి. బక్రీద్ సందర్భంగా ఓ వ్యక్తి లఖ్‌నవూలోని గోమతి నది సమీపంలో ఉన్న మేకల మార్కెట్లో వీటిని కొనుగోలు చేశాడు. కండలు తిరిగి బలిష్టంగా ఉన్న ఈ మేకల్లో ఒకటి 170కిలోలు ఉండగా.. మరొకటి 150 కిలోలు ఉంటుందట. రెండు సంవత్సరాల వయసున్న ఈ మేకలను రోజూ బాదం, కాజు, స్వీట్లు, జ్యూస్‌లు ఆహారంగా పెట్టి పెంచినట్లు విక్రయదారులు వెల్లడించారు. ఇందుకోసం రోజుకు రూ.600ఖర్చు చేసినట్లు తెలిపారు.
బక్రీద్ నేపథ్యంలో మేకల మార్కెట్లు కిటకిటలాడాయి. లఖ్‌నవూలోని కుడియా మేకల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. అయితే, కొవిడ్ నిబంధనలు పాటించకుండా పెద్దసంఖ్యలో ప్రజలు మార్కెట్లోకి రావడంతో కరోనా వ్యాప్తికి అవకాశముందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు