Employee: ఆఫీసులో రోజుకి 6 గంటలు టాయిలెట్‌లోనే.. చివరకు ఇదీ జరిగింది!
Employee: అనారోగ్య కారణాలు చెబుతూ ఓ ఉద్యోగి రోజుకి ఆరు గంటలు టాయిలెట్లో గడపడం కంపెనీ గమనించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై అతడు కోర్టును ఆశ్రయించాడు.
బీజింగ్: ఎవరినైనా కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసింది అనగానే వెంటనే మనసులోకి ఏం ఆలోచన వస్తుంది? బహుశా అతడి పనితీరు బాగోలేకపోయి ఉండొచ్చని అనుకుంటాం. లేదా కంపెనీలో అనుచితంగానైనా ప్రవర్తించి ఉండొచ్చని భావిస్తాం. కానీ, చైనా (China)లో ఓ ఉద్యోగిని తొలగించడానికి కారణం తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యం కలగక మానదు!
చైనా (China)లో వాంగ్ అనే వ్యక్తిని 2015లో కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసింది. విధుల్లో ఉన్న సమయంలో అతడు దాదాపు ఆరు గంటలు టాయిలెట్లోనే ఉంటున్నాడని కంపెనీ తెలిపింది. ఇది నిబంధనలకు విరుద్ధమని చెబుతూ ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీనిపై సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. తనకు ఉన్న అనారోగ్య సమస్యను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించాడు. తన ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ విషయంలో కంపెనీ చర్యను న్యాయస్థానం సమర్థించింది. అనారోగ్య కారణాలు చెబుతూ సుదీర్ఘ సమయం పాటు టాయిలెట్లో ఉంటే ఎలా? అని ఉద్యోగిని ప్రశ్నించింది.
వాంగ్ 2015లో మలద్వార సమస్యతో బాధపడ్డాడు. దీనికి చికిత్స కూడా తీసుకున్నాడు. కానీ, సమస్య పూర్తిగా నయం కాలేదని.. అప్పటి నుంచి సుదీర్ఘంగా టాయిలెట్లో గడపడం మొదలుపెట్టాడు. వెళ్లిన ప్రతిసారి 47 నిమిషాల నుంచి గరిష్ఠంగా మూడు గంటల వరకు టాయిలెట్లోనే ఉండడం కంపెనీ గమనించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో అతణ్ని ఉద్యోగంలో కొనసాగించడం కుదరదని వివరించింది. అనధికార గైర్హాజరు, విధుల్లో జాప్యం వంటి కారణాలతో తొలగించినట్లు తెలిపింది. కంపెనీ వివరణతో సంతృప్తి చెందిన కోర్టు ఉద్యోగికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.
చైనా సామాజిక మాధ్యమాల్లో ఈ తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా మంది కంపెనీ చర్యను సమర్థిస్తున్నారు. అనారోగ్య కారణాలు చెప్పి గంటల కొద్దీ రెస్ట్‌రూంలలోనే ఉంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది గంటల విధుల్లో ఆరు గంటలు బయటే ఉంటే ఇక పనెప్పుడు చేస్తారు? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కోర్టు గనక తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించి ఉంటే.. కంపెనీల్లో టాయిలెట్లకు విరామం ఉండేది కాదని ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో అతడి అనారోగ్య సమస్యపై విచారం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?
-
Congress: అజయ్ మాకెన్‌కు కీలక పదవి!
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా
-
KTR: ఓఆర్ఆర్ చుట్టూ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ODI WC 2023: రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్ వైస్ కెప్టెన్