AP Governor: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రోబోటిక్ విధానంలో సర్జరీ!

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్‌ ఆస్పత్రి బులిటెన్‌ విడుదల చేసింది. 

Published : 19 Sep 2023 01:48 IST

 

అమరావతి: ఏపీ గవర్నర్‌(AP Governor) జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(Abdul Nazeer) ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్‌ ఆస్పత్రి బులిటెన్‌ విడుదల చేసింది. కడుపు నొప్పి సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిపింది. అయితే, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్టు తేలిందని పేర్కొంది. గవర్నర్‌కు రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ విజయవంతంగా నిర్వహించినట్టు ఆస్పత్రి బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపింది. కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురైన గవర్నర్‌ సోమవారం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని