16 నెలల బకాయిలు చెల్లించండి: మాన్సాస్‌ ట్రస్ట్‌ ఉద్యోగులు

మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జీతాలు చెల్లించాలంటూ మాన్సాస్‌ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు శనివారం ముట్టడించారు. కార్యాలయం

Updated : 17 Jul 2021 19:24 IST

విజయనగరం: మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జీతాలు చెల్లించాలంటూ మాన్సాస్‌ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు శనివారం ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీతాలు నిలిపివేయాలంటూ ఈవో బ్యాంకుకు లేఖ రాయడంతో వేతనాలు నిలిచిపోయాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.  16 నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జీతాలు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు మాన్సాస్‌ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, జీతాల కోసం మొదటిసారిగా ఆందోళన చేస్తున్నామని వాపోయారు. అడిగితే తనకేం తెలియదని ఈవో చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్‌గజపతిరాజు ట్రస్ట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈవో జోక్యం పెరిగిందని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  దీంతో ట్రస్టు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 13లోగా సమస్యలు పరిష్కరిస్తామని ట్రస్టు ఈవో హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని