హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కుత్బుల్లాపూర్‌...

Updated : 14 Apr 2021 12:40 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కుత్బుల్లాపూర్‌, బోరబండ, రహమత్‌నగర్‌లో వాన కురిసింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో మున్సిపల్‌, డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. వేసవితాపంతో అల్లాడుతున్న నగర వాసులకు వర్షం కొంత ఉపశమనం కలిగించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని