Published : 01/12/2021 01:30 IST

Nellore: కండలేరు జలాశయం మట్టికట్ట పటిష్టతపై అనుమానాలు

నెల్లూరు: కండలేరు జలాశయం మట్టికట్ట పటిష్టతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పాలకులు పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో కట్ట బలహీన పడుతోంది. చిల్ల చెట్లు ఏపుగా పెరగడంతో కట్ట భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనతో కాలం గడుపుతున్నారు. 

నెల్లూరు జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కండలేరు జలాశయం మట్టికట్ట కొన్ని చోట్ల బలహీనంగా మారింది. భారీ వర్షాలకు కుమ్మరిగుంట సమీపంలో.. ఏడో కిలోమీటర్‌ వద్ద కట్ట మట్టి జారిపోయింది. మట్టికట్టపై ఏళ్ల తరబడి పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ చేపట్టలేదు. దీంతో చిల్ల చెట్లు ఏపుగా పెరిగాయి. పలు చోట్ల వాటి వేర్లు కట్ట లోపలికి చొచ్చుకొనిపోయాయి. జీపు ట్రాక్‌ గుంతలమయంగా మారింది. కట్ట పైనుంచి వర్షపు నీరు కిందకు పోయేందుకు ఏర్పాటు చేసిన సూట్లు దెబ్బతిన్నాయి. నీరు వెళ్లే మార్గానికి అడ్డంకులు తొలగించకపోవడంతో.. పైనుంచి నీరు పారి కట్ట బలహీనపడింది. అధికారులు మాత్రం కండలేరు కట్ట భద్రతపై అనుమానాలు వద్దని చెబుతున్నారు. జలాశయం సామర్థ్యం 68 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు ఉంది. మట్టి జారిన ప్రాంతం నీటి మట్టం కంటే ఎత్తులో ఉందని.. మట్టి జారకుండా ఇసుక బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు చేపడతామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కండలేరు నుంచి నల్లవాగు మీదుగా పెన్నా నదికి నీటిని విడుదల చేస్తుండటంతో స్థానికుల్లో భయాందోళన మరింత పెరిగింది. ఓవైపు మట్టికట్ట జారడం, నీటి ఊట పెరగడంతో కుమ్మరిగుంట గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. భయంతో రాత్రంతా నిద్ర ఉండటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్టు వారు చెబుతున్నారు. చేజర్ల, కలువాయి మండలాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.   

Read latest General News and Telugu News


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని