Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి

మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌(Katakam Sudarshan) మృతిచెందారు.

Updated : 04 Jun 2023 09:44 IST

మంచిర్యాల: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌(Katakam Sudarshan) మృతిచెందారు. మే 31న మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో గుండెపోటుతో మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ప్రకటించారు. కటకం సుదర్శన్‌ బస్తర్‌ మావోయిస్టు పొలిటికల్‌ బ్యూరో సెంట్రల్‌ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఆయన ఉద్యమంలోకి వెళ్లారు. జూన్‌ 5 నుంచి ఆగస్ట్‌ 3 వరకు సుదర్శన్‌ సంస్మరణ సభలు నిర్వహించాలని మావోయిస్టులకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని