పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భవనాలు.. ప్రారంభించిన శైలజాకిరణ్‌

రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఇప్పటి వరకూ రూ.89కోట్లు ఖర్చు చేసి వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని మార్గదర్శి ఎండీ సీహెచ్‌ శైలజాకిరణ్‌ తెలిపారు.

Updated : 05 Feb 2023 19:39 IST

అమరావతి: రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఇప్పటి వరకూ రూ.89కోట్లు ఖర్చు చేసి వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని మార్గదర్శి ఎండీ సీహెచ్‌ శైలజాకిరణ్‌ తెలిపారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామాన్ని 2015లో దత్తత తీసుకుని ఇప్పటి వరకు రూ.16.50కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. రూ.3.50కోట్ల వ్యయంతో గ్రామంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పశువైద్యశాల భవనాలను ఆదివారం శైలజాకిరణ్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాతృభూమి, మాతృభాష అంటే రామోజీరావుకు అమితమైన ప్రేమ అని.. ఆయన పుట్టిన ఊరి రుణం తీర్చుకునేందుకు అవకాశం కల్పించిన పెదపారుపూడి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని