లండన్‌ నగరమంత మంచు ఫలకం

అంటార్కిటికాలోని బ్రిటిష్‌ పరిశోధన కేంద్రం సమీపంలో గల భారీ మంచు పలకం పగుళ్లు వచ్చి రెండుగా విడిపోయింది. ఇలా విడిపోయిన మంచు భాగం లండన్‌ నగర విస్తీర్ణమంత ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు....

Published : 03 Mar 2021 13:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంటార్కిటికాలోని బ్రిటిష్‌ పరిశోధన కేంద్రం సమీపంలో గల భారీ మంచు ఫలకం బీటలువారింది. ఇది సుమారు లండన్‌ నగర విస్తీర్ణమంత ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఉన్న మంచు ఫలకం బీటలువారటాన్ని కాల్వింగా అంటారని తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయి ఫలకం పగుళ్లివ్వడం ఇదే తొలిసారి. పగుళ్ల కారణంగా ఏర్పడిన ఈ అగాధానికి నార్త్‌ రిఫ్ట్‌ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని