Telangana News: రూ.30వేల వేతనంతో పారామెడికల్ ఉద్యోగాలు.. రేపే నోటిఫికేషన్
కంటి వెలుగు రెండో విడత అమలు కోసం పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
హైదరాబాద్: కంటి వెలుగు రెండో విడత అమలు కోసం పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ద్వారా నియామకాలు చేపడతారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకోసం డిసెంబరు 1న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 5న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 7వ తేదీన మెరిట్ జాబితా ముసాయిదా విడుదల చేసి మరుసటి రోజు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి పదో తేదీన తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్లకు నెలకు రూ.30వేల వేతనం ఇస్తారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలు ఏర్పాటుచేయనున్నారు. జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు రెండో విడత ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్భవన్లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్
-
Crime News
TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు
-
World News
China: జననాల క్షీణత ఎఫెక్ట్.. అక్కడ పెళ్లికాకపోయినా పిల్లల్ని కనొచ్చు..!