Matrimonial ADVT: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయితే కాల్‌ చేయొద్దు.. వైరల్‌గా మారిన పెళ్లి ప్రకటన

కొన్ని మ్యాట్రిమోనియల్ ప్రకటనలు ఈ మధ్య పాపులర్‌ అవుతున్నాయి. ఇలాంటి అర్హతలు, ఈ గుణాలు ఉన్నవారు మాత్రమే కావాలంటూ.........

Published : 21 Sep 2022 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని మ్యాట్రిమోనియల్ ప్రకటనలు ఈ మధ్య పాపులర్‌ అవుతున్నాయి. ఇలాంటి అర్హతలు, ఈ గుణాలు ఉన్నవారు మాత్రమే కావాలంటూ చేసిన పలు ప్రకటనలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా వరుడు కావాలంటూ యువతి తరఫు వారు చేసిన ఓ ప్రకటన సైతం ఆశ్చర్యపరిచేలా ఉంది. ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌’ అయితే మాకొద్దూ అంటూ అందులో ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం.

‘ధనిక వ్యాపార కుటుంబంలోని ఎంబీఏ పూర్తిచేసిన వధువుకు ఐఏఎస్‌/ఐపీఎస్‌, వైద్యుడు, పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయిన వరుడు కావాలి’ అని ప్రకటిస్తూనే.. ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కాల్‌ చేయొద్దు’ అంటూ స్పష్టం చేశారు. కాగా ఈ ప్రకటనకు సంబంధించిన క్లిప్పింగ్‌ను వ్యాపారవేత్త సమీర్‌ అరోరా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘ఐటీ భవిష్యత్తు సజావుగా కనిపించడం లేదు’ అనే వ్యాఖ్యలు జోడించారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

దేశంలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్లే ఉన్నారనే అర్థం వచ్చేలా.. అరోరా వ్యాఖ్యలను ఓ యూజర్‌ ఉటంకిస్తూ ‘అయితే, దేశ ప్రజల భవిష్యత్తే సజావుగా లేదు’ అంటూ స్పందించాడు. ‘ఐటీ లేకపోతే దేశ భవిష్యత్తు సరిగా ఉండదు అంటూ మరో యూజర్‌ పేర్కొన్నాడు. ‘మేం అంత చెడ్డవాళ్లమా’ అంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన ఆవేదన వెల్లగక్కాడు. ‘దేవుడా ధన్యవాదాలు.. నాకు 11ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది’ అని మరో వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని