French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్యాన్స్‌కి కష్టాలు... ఎందుకంటే?
ఫ్రెంచ్‌ఫ్రైస్ అంటే నచ్చని వారు ఉంటారా? బంగాళదుంపలతో తయారు చేసే ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని లొట్టలేసుకుని మరీ తింటారు. ఉప్పు, కారం, కాస్త మసాలా దట్టించి తింటే.. అబ్బబ్బా! ఆ రుచే వేరు. అందుకే వాటి రేటు ఎంత ఉన్నా సరే! లైట్ తీసుకొని మరీ.. ఎగబడి కొంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రెంచ్‌ఫ్రైస్ అంటే నచ్చని వారు ఉంటారా? బంగాళదుంపలతో తయారు చేసే ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని లొట్టలేసుకుని మరీ తింటారు. ఉప్పు, కారం, కాస్త మసాలా దట్టించి తింటే.. అబ్బబ్బా! ఆ రుచే వేరు. అందుకే వాటి రేటు ఎంత ఉన్నా సరే! లైట్ తీసుకొని మరీ.. ఎగబడి కొంటారు. ఇప్పుడు ఏ ఫుడ్‌స్టాల్స్‌లో చూసినా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్దే రాజ్యం. ఇంట్లో స్నాక్స్ చేయాలన్నా.. దీనిదే హవా. అదన్న మాట ఫ్రెంచ్ఫ్రైస్కి ఉన్న క్రేజ్. అయితే ఆ దేశంలో మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్యాన్స్‌కు వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు.
దానికి కారణం బంగాళదుంపల కొరతేనట. అయితే కస్టమర్స్‌ని నిరాశ పరచకూడదని నిశ్చయించుకుంది అక్కడి మెక్ డొనాల్డ్స్. అందరూ ఫ్రెంచ్‌ఫ్రైస్ తినాలనే ఉద్దేశంతో ఫ్రైంచ్ఫ్రైస్ సైజు చిన్నగా చేసి మార్కెట్లో అమ్ముతున్నారట. ఇదంతా ఎక్కడా కాదండోయ్. జపాన్‌లో. సరిపడా ఆలూ లేక కనీసం మీడియం సైజ్‌లో కూడా ఫ్రెంచ్‌ఫ్రైస్ దొరకని పరిస్థితి అక్కడ నెలకొంది. వేరే మార్గం లేక.. ఉన్న రేటుకే చిన్నసైజులో అక్కడి ఫుడ్రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్ అమ్మేస్తున్నారు. ‘‘ ఈ విషయంలో మాత్రం.. ప్లీజ్! మమల్ని క్షమించండి’’ అంటూ కస్టమర్స్‌కి అర్థమైయ్యేల్లా కస్టరమర్లకు చెప్పేప్రయత్నంచేసింది మెక్ డొనాల్డ్స్. ప్రస్తుత పరిస్థితులే ఇందుకు కారణమని వెబ్సైట్లో రాసుకొచ్చింది.
‘‘ జపాన్‌లో ఇటీవల వరదలు, కరోనా ప్రభావం.. ఆహార రంగం మీద తీవ్ర నష్టం చూపించింది. కావాల్సిన మొత్తంలో కూరగాయలు కూడా పండటం లేదు. ఇక ఆలూకి వచ్చిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని ఇంత చిన్న చేసి అమ్మాల్సి వస్తుంది. మీకు ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. మీరిక్కడ తినే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా జపాన్‌లో పండించినవి కావు. కెనడా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఏదైమైనా సైజ్ తగ్గించి.. మీకు ఇబ్బంది కలిగించి అమ్ముతున్నందుకు క్షమించండి. 2021 డిసెంబర్ 30 వరకూ ఇదే కొనసాగనుంది’’ అంటూ వాళ్ల బాధ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?