Raghurama: ఆర్మీ ఆస్పత్రిలో కొనసాగుతున్న వైద్యపరీక్షలు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి ఏపీ సీఐడీ పోలీసులు

Updated : 18 May 2021 14:49 IST

హైదరాబాద్‌: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి ఏపీ సీఐడీ పోలీసులు తీసుకొచ్చారు. ఆర్మీ ఆస్పత్రిలోని ముగ్గురు వైద్యుల బృందం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య పరీక్షలను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అనంతరం పరీక్షల నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

జ్యుడిషియల్‌ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజు వైద్యపరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్‌ అధికారిని నియమించింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ నాగార్జునను జ్యుడిషియల్‌ అధికారిగా నియమించినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు