మరో బప్పీలహరి కథ వింటారా!

బప్పీలహరి కేవలం పాటలు, సంగీతం వల్లే ప్రసిద్ధి చెందారనుకుంటే పొరపాటే. తను ధరించే బంగారు ఆభరణాల వల్ల కూడా ఆయనకో క్రేజ్‌ ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్థాయిలో బంగారంపై ప్రేమ చూపించిన వారు లేరు. ఇప్పుడా స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు మనోజ్‌ సెన్గార్‌.

Published : 23 Jun 2021 17:32 IST

 రూ.5 లక్షల విలువ చేసే బంగారు మాస్క్‌ 

కాన్పుర్‌: బప్పీలహరి కేవలం పాటలు, సంగీతం వల్లే ప్రసిద్ధి చెందారనుకుంటే పొరపాటే. తను ధరించే బంగారు ఆభరణాల వల్ల కూడా ఆయనకో క్రేజ్‌ ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్థాయిలో బంగారంపై ప్రేమ చూపించిన వారు లేరు. ఇప్పుడా స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు మనోజ్‌ సెన్గార్‌. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ అతడి స్వస్థలం. బంగారంపై అతడి ప్రేమను చూసి అందరూ ‘ఉత్తర్‌ప్రదేశ్‌ బప్పీలహరి’ అని పిలుస్తున్నారు. పసిడిపై ప్రేమ విషయంలో బప్పీకి ఏ మాత్రం తీసిపోనని తాజాగా ఓ సంఘటనతో  నిరూపించాడు. థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో మాస్క్‌ను బంగారంతో తయారు చేయించాడు. ఇందుకు రూ.5 లక్షలు వెచ్చించాడట మనోజ్‌. మరి దీన్ని శుభ్రపరచేందుకు అనువుగా శానిటైజర్‌ను కూడా మాస్క్‌ లోపలే అమర్చారట. ఇది మొత్తం మూడేళ్లు పని చేస్తుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. దీనికి ‘శివ శరన్‌ మాస్క్‌’ అని పేరు పెట్టాడీ జూనియర్‌ బప్పీ. 

కాన్పుర్‌ గోల్డెన్‌ బాబా!
 మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. అయితే మనిషి మనస్తత్వాలు పోలినట్లు మరొకరు ఉంటారని నిరూపిస్తున్నాడు ఉత్తర్‌ ప్రదేశ్‌ బప్పీలహరి మనోజ్‌. అతడు 250 గ్రాములతో కూడిన నాలుగు బంగారు గొలుసులను ఎప్పుడూ ధరించి ఉంటాడు. అంతేకాదు, సుమారు రెండు కిలోల బంగారాన్ని ఒంటిపై వేసుకునేందుకు వెనుకాడడు. రివాల్వర్‌ కవర్‌, చెవి రింగులతో పాటు మూడు బంగారు బెల్ట్‌లు ధరించి ఉండటంతో కాన్పుర్‌ వాసులు అతడిని ‘గోల్డెన్‌ బాబా’ అని పిలుస్తుంటారు. 

బెదిరింపులు వచ్చినా భయపడలేదు
ఇంత బంగారం ధరించే మనోజ్‌కు ప్రాణహాని ఉందని బెదిరింపు కాల్స్‌ వచ్చాయట. మరి మీకు రక్షణ ఎలా అని ఎవరైనా అడిగితే మాత్రం ‘‘ఇందుకు జాగ్రత్తలు తీసుకున్నాను. ప్రత్యేకించి బాడీ గార్డులను పెట్టుకున్నాను. నిరంతరం వాళ్లు నన్ను కాపాడుతుంటారు’’ అని చెబుతాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని