మద్యం నుంచి వినసొంపైన సంగీతం

ఇటలీకి చెందిన ఇద్దరు యువ ఇంజినీర్ల సరికొత్త ఆవిష్కరణతో మద్యం ఇకపై రుచి, కిక్కుతో పాటు సంగీతాన్ని వినిపించనుంది. ద్రవాల కదలిక ధర్మం ఆధారంగా వైన్‌ నుంచి సంగీతం స్వరపరిచిన ఇంజినీర్లు ఔరా అనిపిస్తున్నారు....

Updated : 22 Feb 2021 05:16 IST

రోమ్‌: ఇటలీకి చెందిన ఇద్దరు యువ ఇంజినీర్ల సరికొత్త ఆవిష్కరణతో మద్యం ఇకపై రుచి, కిక్కుతో పాటు సంగీతాన్ని వినిపించనుంది. ద్రవాల కదలిక సూత్రం ఆధారంగా వైన్‌ నుంచి సంగీతం స్వరపరిచిన ఇంజినీర్లు ఔరా అనిపిస్తున్నారు. నాణ్యమైన మద్యం గొప్ప సంగీతాన్ని వినిపిస్తుందని మద్యం నుంచి మ్యూజిక్‌ను స్వరపరిచిన వాయిద్యకారుడు ఫిలిప్పో కోసెంటినో పేర్కొన్నారు. ఇటలీలో జనాదరణ పొందిన బరోలో రెడ్‌ వైన్‌ నుంచి వినసొంపైన సంగీతాన్ని తాము సృష్టించినట్లు ఆయన తెలిపారు. ద్రవాల కదలిక ధర్మం ఆధారంగా వైన్‌ నుంచి శబ్దాలను సృష్టించినట్లు ఆయన వివరించారు. సృష్టిలో ఒక్కో ద్రవానికి ఒక్కో కదలిక ధర్మం ఉంటుంది. వాటిలో ఏదైనా అలజడి సృష్టిస్తే శబ్ద ధర్మమూ ఉంటుంది. వైన్‌కు కూడా ఆ రెండు ధర్మాలు ఉంటాయని ఈ ఇద్దరు సౌండ్‌ ఇంజినీర్లు నిరూపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు