Vishakhapatnam: మూగ జీవాలే ఆమెకు పిల్లలు..!

విశాఖపట్నం పెద్ద వాల్తేరు ప్రాంతంలో ఓ ఇరుకు వీధిలోకి మూగజీవాలు.. నిర్ణీత వేళకు బారులు తీరతాయి. ఇవన్నీ ప్రతిరోజు..

Published : 25 Nov 2021 20:17 IST

విశాఖపట్నం: విశాఖపట్నం పెద్ద వాల్తేరు ప్రాంతంలో ఓ ఇరుకు వీధిలోకి మూగజీవాలు.. నిర్ణీత వేళకు బారులు తీరతాయి. ఇవన్నీ ప్రతిరోజు.. ఒకే సమయంలో ఆ ఇంటి వద్దకు చేరతాయని పరిశీలించినవారికి మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. వాటిని అదరించడమే పనిగా పెట్టుకుని వాటితోనే మమేకం అవుతున్నారు విశాఖకు చెందిన శాంతి. కష్టపడి సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం మూగజీవుల ఆహారం కోసమే ఆమె ఖర్చు చేస్తున్నారు. 

వివాహం కూడా చేసుకోకుండా ఆ జీవులను శాంతి సాకుతున్నారు. కుట్టుపని చేసి సంపాదించే మొత్తాన్ని తన జీవనం కోసం కొద్దిగా ఉపయోగించుకొని.. మిగిలిన డబ్బును మూగజీవాల కోసమే వెచ్చిస్తున్నారు. వాటికి నిత్యం రెండు పూటలా ఆహారం అందిస్తున్నారు. ఆవులు, పిల్లులు, శునకాలు.. ఇలా తన ఇంటి వద్దకు వచ్చే మూగ జీవాలన్నిటికి ప్రత్యేకంగా పేర్లు పెట్టి పిలుచుకుంటారామె. ప్రతి రోజు ఉదయం.. ఆహారం కోసం ఓ సమయంలో శునకాలు, పిల్లులు వస్తే.. మరో సమయంలో ఆవులు ఆహారం కోసం వస్తాయి. సాయంత్రం సైతం ఈ మూగజీవాలు ఇక్కడికి వస్తాయి. నిత్యం వాటికి సమయానికి ఆహారం అందించడం కోసం శ్రమించడంలో ఆనందం పొందుతున్నట్టు ఆమె తెలిపాతరు. ఆ మూగ జీవులు ఒక్కరోజు కనిపించకపోయినా తట్టుకోలేనని ఆమె చెప్పారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని