Updated : 30 Jul 2021 09:40 IST

Big mouth: వామ్మో! సమంత నోరు ఎంత పెద్దదో!

టిక్‌టాక్‌తో గుర్తింపు

ప్రపంచంలోనే అతిపెద్ద నోరుగల మహిళగా గిన్నిస్‌ రికార్డు కైవసం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టిక్‌టాక్‌ సామాన్య ప్రజల్ని సెలబ్రెటీలను చేయడమే కాదు.. ఒక మహిళనైతే ఏకంగా గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించేలా చేసింది. అమెరికాలోని కనెక్టికట్‌ చెందిన 31ఏళ్ల సమంత రామ్‌స్‌డెల్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద నోరు (6.52 సెంటీమీటర్లు)గల మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ కొట్టేసింది. గిన్నిస్‌ బుక్ పెద్దలు.. ఆమె నోటి కొలతలను డాక్టర్‌ ఎల్క్‌ చెయింగ్‌ డిజిటల్‌ క్యాలిపర్స్‌ సాయంతో కొలతలు తీసుకున్నారు. ఆపై జరిపిన పరిశీలన అనంతరం మహిళల్లో ఆమెదే అతి పెద్ద నోరు సమంతదేనని ప్రకటించారు. కేవలం నోటి ద్వారా గిన్నిస్‌లో సంపాదించేసింది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆమెకి ఇదంతా ఎలా సాధ్యమైందో ఇక మీరు చదివేయండి..

లోపాన్నే ప్రేమించా..

ఇప్పుడైతే.. నెటిజన్లు ఆమె ప్రత్యేకతను గుర్తించి ప్రశంస్తిస్తున్నారు కానీ ఆమెని చిన్నప్పుడు పలకరిస్తే.. తోటి స్నేహితుల నుంచి వెక్కిరింతలు, హేళన మాత్రమే కనిపించేదట. ఇదే విషయాన్ని తన మాటల్లో చెబుతూ.. ‘‘చిన్నప్పుడు నా నోటి చూసి నాతోటి పిల్లలు వెక్కిరించేవారు. అయినా సరే.. ఇది నాలో లోపంగా భావించలేదు. ఏ లోపాన్నైతే ఎత్తిచూపారో..దాన్నే ప్రేమించడం ప్రారంభించా. ఇప్పుడు ఇదే అందరికీ స్ఫూర్తిగా నిలవడం ఆదర్శంగా ఉంది. మీ అందరికీ నేనిచ్చే సలహా ఒకటే.. మీ శరీరంలో ఏదైనా అవయవంలో లోపం ఉన్నా, చిన్నచూపుగా భావించకండి ఆ అవయవంతోనే వైవిధ్యంగా చూపించడానికి మీ వంతు ప్రయత్నించండి. సిగ్గుపడొద్దు. గర్వంగా చేయండి. అదే మీకు పెద్ద ఆస్తిగా నిలుస్తుంది. అదే మీకు శక్తి కూడా. గతేడాది కరోనా వేళ టిక్ టాక్‌లో వీడియోలు చేయడం ప్రారంభించా. అందులో నా ఎంట్రీ ఆలస్యమైనప్పటికీ ..ఇప్పుడు దాంతోనే సమయం గడుపుతూ నన్ను బిజీ చేసుకున్నా. సృజనాత్మకంగా ఉండే వీడియోలు అప్‌లోప్‌ చేసేదాన్ని. కొన్ని కామెడీ, మరికొన్ని పాటలు పాడటం.. ఇలా అనమాట. ఒక కామెడీ వీడియో అయితే వైవిధ్యమైన ఎక్స్‌ప్రెషన్లతో చేశా. అంతే అది చూసి చిన్నారులంతా.. ‘‘ నీ ముఖానికి ఏమైంది’’ అంటూ కామెంట్లు పెట్టేవారు. నాలో ఏది చూసి హేళన చేశారో.. అదే ఇప్పుడు నాకు గుర్తింపు తెచ్చేలా చేసింది. ఇప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ కి 12లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండటమూ గర్వంగా ఉంది.

మా ఇంట్లో ఎవరికీ పెద్దనోరు లేదు..
మా కుటుంబంలో ఇంత పెద్ద నోరు ఎవరికీ లేదు. నా నోరు మాత్రమే ఇంత పెద్దగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక ఆపిల్‌ లేదా బర్గర్‌, ఫ్రెంచ్ ఫ్రైస్‌ని అమాంతం నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తా.

* ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియోని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌  యూట్యూబ్‌ వేదికగా పంచుకుంది. ప్రపంచంలో అతి పెద్ద నోరుగల మహిళగా గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించేసుకున్న సమంత.. పురుషుల్లో గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డు కొల్లగొట్టిన ఐసాక్‌ జాన్‌సాన్‌తోనూ జోడీకట్టి వీడియోలు చేసింది. సరదాగా చేసిన టిక్‌టాక్‌ ఆమెకు గుర్తింపునివ్వడంతో హాస్యం పండించే కళాకారిణిగా పేరు తెచ్చుకుంటానని చెప్పేస్తుంది. ప్రపంచంలో ఎందరో హాస్యనటులు, గాయకులు ఉన్నా.. తన నోటితో ప్రపంచానికి పరిచయమవుతానని ఎన్నడూ ఊహించలేనని చెబుతుంది.Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని