Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
ఉద్యోగుల బకాయిలు, చెల్లింపులు, చట్టబద్ధత అనే అంశంపై విజయవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 13 తీర్మానాలను ఆమోదించారు.
విజయవాడ: మార్చిలో జరిగే ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల బకాయిలు, చెల్లింపులు, చట్టబద్ధత అనే అంశంపై విజయవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 13 తీర్మానాలను ఆమోదించారు.
జీతాల చెల్లింపు విషయంలో చట్టం చేయాలనే డిమాండ్‌పై అన్ని పార్టీలకు వినతిపత్రాలు ఇస్తామని సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చట్టం చేయమని అడిగితే ఇతర సంఘాల నేతలు ఎందుకు వింతగా చూస్తున్నారో అర్థం కాడడం లేదన్నారు. మహారాష్ట్రలో ఉద్యోగుల బదిలీలు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చట్టం ఉందని గుర్తు చేశారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి వినతిపత్రాలు ఇస్తామన్నారు. జీతాల చెల్లింపుల చట్టబద్ధతపై అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తామని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kola Guruvulu: కోలా గురువులుకు మళ్లీ నిరాశే
-
Ap-top-news News
Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Politics News
kotamreddy giridhar reddy: తెదేపాలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
-
World News
Tourist Visa: పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
-
Politics News
హిమంతను రాహుల్ సరిగా డీల్ చేయలేదు