Breakup: బ్రేకప్‌ అయితే ఎక్కువ బాధపడేది మగవారేనట!

ప్రేమ.. ఒక మధురమైన అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికి జీవితం సరిపోదు. కానీ, కొందరు చిన్న చిన్న మనస్పర్థలతో బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతున్నారు. ఆ తర్వాత వారి జ్ఞాపకాలను మర్చిపోలేక లోలోపలే మదనపడుతుంటారు. అయితే, బ్రేకప్‌ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ

Published : 04 Feb 2022 20:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమ.. ఒక మధురమైన అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికి జీవితం సరిపోదు. కానీ, కొందరు చిన్న చిన్న మనస్పర్ధలతో బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతున్నారు. తర్వాత ఆ జ్ఞాపకాలను మర్చిపోలేక లోలోపలే మదనపడుతుంటారు. అయితే, బ్రేకప్‌ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధ పడతారని, దాంతో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. 

యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాకు చెందిన డాక్టర్‌ జాన్‌ ఒలిఫ్.. ‘మెన్స్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌’లో భాగంగా బ్రేకప్‌ తర్వాత అబ్బాయిల మానసిక పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఇందుకోసం బ్రేకప్‌ అయిన కొందరు అబ్బాయిలను ఇంటర్వ్యూ చేసి.. వారి మానసిక ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. కాగా.. ప్రియురాలితో విడిపోయిన తర్వాత చాలా మంది అబ్బాయిల్లో ఆందోళన, నిరాశ ఎక్కువవుతోందని, అది ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలకు దారి తీస్తోందని నివేదికలో వెల్లడైంది. పురుషులు సమాజానికి భయపడి వారి మానసిక ఆరోగ్య సమస్యల గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడట్లేదట. సానుకూల అంశమేమిటంటే.. ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండేందుకు అబ్బాయిలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని, వ్యాయామం, పుస్తక పఠనం, నచ్చిన పనులు చేస్తూ సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారని డాక్టర్‌ జాన్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు