వ్యక్తిగత పరిశుభ్రతపై 2.5లక్షల మంది బాలికలకు అవగాహన

దేశంలోని చాలా మంది మహిళలకు నెలసరిపై కచ్చితమైన అవగాహన లేదనే చెప్పవచ్చు. అనేకమంది ఇప్పటికీ సరైన న్యాప్‌కిన్‌లు

Published : 27 May 2022 20:12 IST

ముంబయి: దేశంలోని చాలా మంది మహిళలకు నెలసరి, తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంకా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘నైన్ హైజీన్ అండ్ పర్సనల్ కేర్’ సంస్థ ఓ బృహత్తర కార్యక్రమానిక చేపట్టింది. మే 28న రుతుక్రమ ఆరోగ్యం-పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని.. గడిచిన నెలరోజుల వ్యవధిలో 8 రాష్ట్రాల్లోని 2.5 లక్షల మంది బాలికలకు శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేసింది. 7.5 లక్షల మంది మహిళలకు నెలసరి సమయంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించింది. సంస్థకు చెందిన స్వయం సహాయక బృందాలు గ్రామాల్లోని ప్రజల వద్దకు చేరుకొని రుతుక్రమంపై చర్చించడం, దానిచుట్టూ ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది.

తాము చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడం పట్ట సంస్థ వ్యవస్థాపకుడు అమర్‌ తుల్సియన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇంత తక్కువ సమయంలో 2.5 లక్షల మంది బాలికల వద్దకు చేరుకొని వారికి అవగాహన కల్పించడం అసాధారణమై విషయం. కానీ, మా బృందాలు దాన్ని సాధ్యం చేసి చూపాయి. రుతుచక్రం ప్రారంభం అనేది స్త్రీలలో జీవసంబంధమైన మార్పులలో  ఒకటి. దానిపై వారికి అవసరమైన అవగాహన కల్పించటంతో పాటు, శానిటరీ న్యాప్‌కిన్‌లను అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే శక్తిని అందిస్తున్నాం. నెలసరి ఆరోగ్యం, పరిశుభ్రత ప్రతి  మహిళకు అందుబాటులో ఉండేలా సమాజంలో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాము. ’ అని అమర్‌ తుల్సియన్‌  పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని