Hyderabad Metro: గణేశ్‌ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు

నగరంలో గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు.

Published : 27 Sep 2023 19:28 IST

హైదరాబాద్‌: నగరంలో గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు నడపనున్నట్లు పేర్కొన్నారు. రాత్రి 2 గంటల వరకు ఆయా రైళ్లు చివరి స్టేషన్లు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. 
 
ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనపు రైళ్లు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో రైల్ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు