Migrain: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా!

పార్శ్వ నొప్పి(మైగ్రేన్‌)తో తలెత్తే ఇబ్బందులు అనేకం. అసలు మైగ్రేన్‌ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది! దీనికి చికిత్స ఉందా! అనే విషయాలు తెలుసుకుందాం! 

Published : 02 Oct 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పార్శ్వ నొప్పి(మైగ్రేన్‌)తో తలెత్తే ఇబ్బందులు అనేకం. అసలు మైగ్రేన్‌ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది! దీనికి చికిత్స ఉందా! అనే విషయాలు తెలుసుకుందాం! 

పని ఒత్తిడి, అలసట దీంతో తలనొప్పి మొదలవుతుంది. సాధారణంగా వచ్చే తలనొప్పి తొందరగానే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్‌ తలనొప్పి వచ్చిందంటే ఆ బాధ భయంకరం. 

అసలు  మైగ్రేన్‌ తలనొప్పి అంటే ఏంటి? 

తలనొప్పి అనేక రకాలుగా ఉంటుంది. ఇందలో మైగ్రేన్‌ తలనొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాలి. ఇది తలలో ఒకే వైపు నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొద్దిసేపు ఉండి తగ్గిపోయేది కాదు. గంటల నుంచి రోజులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. 
నాడీకణాలు ఎక్కువగా స్పందించడం వల్ల ఈ నొప్పి వస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, హార్మోన్లలో అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి.
సాధారణంగా తలనొప్పి వస్తే శబ్దాలు వినలేరు. కళ్లు నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ మైగ్రైన్‌ తలనొప్పి వస్తే అలసట, కళ్లు తిరగటం, కళ్లు సరిగ్గా కనిపించకపోవటం, విపరీతమైన తలనొప్పి ఉంటుంది. ఈ వ్యాధికి పూర్తిస్థాయిలో చికిత్స లేదు. కానీ భయపడాల్సినంత ప్రమాదకరమైన వ్యాధి కాదు. శాశ్వత పరిష్కారం లేకున్నా.. ఈ సమస్య వచ్చినప్పుడు ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకోండి.

* నొప్పి ఉన్న చోట ఐస్‌క్యూబ్‌లను పెట్టాలి. కాస్త ఉపశమనం ఉంటుంది. 

*  పెద్ద పెద్ద శబ్దాలు, ఎక్కువగా వెలుతురు లేని గదిలో నిద్రపోవాలి. 

* మైగ్రేన్‌ తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే యోగా, ప్రాణాయామం చేయండి. 

* మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెతో నొప్పి ఉన్నచోట మర్దన చేయించుకోండి. దీంతో నొప్పి నుంచి కాస్త ఉపశమనం  లభిస్తుంది. 

* మైగ్రేన్‌ తలనొప్పి వస్తే ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి. 

* ఏ విధమైన సమస్యకైనా నిద్ర ఒక పరిష్కారం. మంచి నిద్ర శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అందుకే నిర్ణీత సమయం వరకు నిద్ర పోవాలి. 

* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని