Andhra news: మూడు రాజధానులకు మేం కట్టుబడి ఉన్నాం: బొత్స సత్యనారాయణ

ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలా.. లేదా.. అనేది చర్చించి చెబుతానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హైకోర్ట...

Published : 03 Mar 2022 15:51 IST

అమరావతి: ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలా.. లేదా.. అనేది చర్చించి చెబుతానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో తెలియదని.. తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత సాయంత్రం అన్ని విషయాలు చెబుతానన్నారు. రాజ్యాంగ పరంగా చట్టపరిధిలో చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయన్నారు. ‘‘మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే ఎలా ఇస్తారు?ఏదైనా ప్రాక్టికల్‌గా సాధ్యపడుతుందా? లేదా? అనేది చూడాలి. హైకోర్టు తీర్పు పూర్తిగా చదివాక వీటన్నింటిపై  స్పందిస్తాను. మూడు రాజధానులకు మేం కట్టుబడి ఉన్నాం. త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతాం. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పరిపాలన వికేంద్రీకరణ చేయాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధానం. మూడు రాజధానుల ఏర్పాటుకు ఈ క్షణం వరకు నిబద్ధతతో ఉన్నాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని