Andhra News: జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం: మంత్రి బొత్స
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈనెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్.. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్‌లను అందజేస్తారని తెలిపారు. సుమారు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్‌లు ఇస్తున్నట్టు చెప్పారు. టెన్త్, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సీఎం చేతుల మీదుగా సత్కరిస్తామన్నారు.
విద్యా కానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. అలాగే ఈనెల 28న నాలుగో విడత అమ్మఒడి నిధులను సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు. మొదటి దశలో 12వేల పాఠశాలల్లో సాంకేతికత ద్వారా విద్య అందిస్తామన్నారు. రాష్ట్రంలో గోరు ముద్ద ద్వారా మంచి భోజనం అందిస్తున్నామని బొత్స వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bengaluru traffic : కారులో నుంచి ఆర్డర్ చేస్తే పిజ్జా వచ్చేసింది.. అట్లుంటది బెంగళూరు ట్రాఫిక్!
-
Hyderabad: మరో రెండు కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన.. 12వేల మందికి ఉపాధి
-
ChatGPT: చాట్‌జీపీటీ నుంచి బిగ్ అప్డేట్.. ఇక రియల్‌టైమ్ సమాచారం
-
Cricket: చైనాకు బయల్దేరిన టీమ్ఇండియా.. ఆ రెండు మ్యాచ్‌లకు బావుమా దూరం
-
MS Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు