KTR: 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు వేదికగా హైదరాబాద్: కేటీఆర్‌

రానున్న రోజుల్లో 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘యామ్ టెక్’ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Updated : 25 Mar 2023 15:53 IST

హైదరాబాద్: రానున్న రోజుల్లో 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘యామ్ టెక్’ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో ఆయన పాల్గొని మాట్లాడారు. 3డీ ప్రిటింగ్, ఆవిష్కరణల రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధి చేసి విదేశాలకు అందిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడికల్, పరిశ్రమ రంగాల్లోనూ ఈ త్రీడీ ప్రిటింగ్‌ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు కేటీఆర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని