Gangula kamalakar: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా చూడాలి: మంత్రి కమలాకర్‌

తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పురోగతిపై విస్తృతంగా చర్చించారు. 

Updated : 15 Nov 2022 20:40 IST

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పురోగతి, ఇతర  అంశాలపై విస్తృతంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులకు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, గన్నీ సంచులు సరిపడా అందుబాటులో ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

‘‘ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే రోజుతో పోలిస్తే దాదాపు 83వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సేకరించాం. ఇవాళ్టి వరకూ 1,32,989 మంది రైతుల నుంచి 8.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగలిగాం. నవంబరు, డిసెంబరు మాసాల్లోనే వానాకాలం ధాన్యం సేకరణ అధికంగా జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వరి పంట కోతలకు అనుగుణంగా ఇప్పటివరకు 4,579 కొనుగోలు కేంద్రాలు తెరిచాం. అవసరాల మేరకు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు తేమ లేకుండా ఆరబెట్టిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి’’ అని  మంత్రి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని