TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..

తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Updated : 06 Jun 2023 14:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న ₹లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు. కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ సాయం అందించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని