TS News: వచ్చే 3 వారాలు చాలా కీలకం: మంత్రి హరీశ్‌రావు

కరోనా ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే 3 వారాలు చాలా కీలకమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నారాయణపేట జిల్లా

Published : 18 Jan 2022 16:43 IST

కోయిల్‌కొండ: కరోనా ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే 3 వారాలు చాలా కీలకమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నారాయణపేట జిల్లా కోయిల్‌కొండలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాట చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అందరూ తప్పకుండా మాస్క్‌ ధరించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని, ఏఎన్‌ఎం సబ్‌సెంటర్‌, పీహెచ్‌సీ, ప్రభుత్వ దవాఖానాకు ఎక్కడికి వెళ్లినా కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 

ఎంతమందికి కరోనా వచ్చినా మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల కొవిడ్‌ టెస్టింగ్ ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉందని,  కోటి మందికి సరిపడా హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉంచామని మంత్రి వెల్లడించారు. ‘‘అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి, వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకుని ఇచ్చిన మందులను వారం రోజుల పాటు వాడితే తగ్గిపోతుంది. అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి.. డబ్బులు వృథా చేసుకోవద్దు. ప్రజాప్రతినిధులు, అధికారులు 100శాతం వ్యాక్సిన్‌ అందించే విధంగా కృషి చేయాలి. వారం రోజుల్లో నారాయణపేటకు డయాలసిస్‌ కేంద్రం మంజూరు చేస్తాం. నారాయణపేటలో రూ.66 కోట్లతో  300 పడకల ఆసుపత్రి నిర్మించబోతున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో శంకుస్థాపన చేస్తాం’’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని