
Published : 18 Jan 2022 11:21 IST
TS News: వారందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వాలి: కేంద్రమంత్రికి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య గడువును తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషన్ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్లు దాటిన అందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు.
అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోసు పాలసీలు.. వాటి ఫలితాల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రికి హరీశ్‌రావు విన్నవించారు.
Tags :