రైల్వేలైన్ పనులు వేగవంతం చేయాలి

మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని.. గజ్వేల్ ‌రైల్వే‌‌‌ స్టేషన్ పనులు పూర్తి అయినందున ప్రయోగాత్మకంగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు‌ అధికారులను ఆదేశించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే..

Updated : 12 Oct 2022 16:01 IST

అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశం‌

హైదరాబాద్‌: మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను వేగవంతం చేయాలని.. గజ్వేల్ ‌రైల్వే‌‌‌ స్టేషన్ పనులు పూర్తి అయినందున ప్రయోగాత్మకంగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు‌ అధికారులను ఆదేశించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పనులు వేగంగా జరగాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని ఆయన సూచించారు. అలాగే మనోహరాబాద్ పాత రైల్వే స్టేషన్ వద్ద అండర్ పాస్ ప్యాచ్ వర్క్ పనులను సైతం జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. రైల్వే లైను పనులు జరిగే చోట విద్యుత్ లైన్లు మార్చాల్సి వస్తే ఆ పనులను వేగవంతంగా పూర్తి‌చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా మనోహరాబాద్‌ రైల్వే లైన్‌కు సంబంధించిన భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. అలాగే సిద్దిపేట రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని