Telangana news: బీబీ నగర్ ఎయిమ్స్‌లో వైద్య సేవలపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి

బీబీ నగర్ ఎయిమ్స్‌ని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అక్కడ అందుతున్న వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 20 May 2022 16:08 IST

హైదరాబాద్: బీబీ నగర్ ఎయిమ్స్‌ని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అక్కడ అందుతున్న వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి పలుమార్లు ఆస్పత్రిని సందర్శించారే తప్ప సదుపాయాల గురించి ఎప్పుడూ కేంద్రాన్ని అడగలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వమే ముందుకు వచ్చి బీబీ నగర్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్ని రకాలుగా సహకరించినా ప్రజలకు ఉపయోగం కలగటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కేవలం 20 మంది ఇన్‌పేషెంట్లు మాత్రమే ఉండటాన్ని గమనించిన మంత్రి.. ఎయిమ్స్ లాంటి పెద్దాస్పత్రిలో ఇంత తక్కువ సంఖ్యలో రోగులు ఉండటం దారుణమన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు సైతం ఎయిమ్స్‌లో క్లినికల్ ప్రాక్టీస్ చేయలేక యాదాద్రి జిల్లా ఆస్పత్రికి వెళ్లి ప్రాక్టీసు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రి పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పిన హరీశ్‌రావు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ అభివృద్ధి కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని