శ్రీరామనవమికి భద్రాద్రి రావొద్దు: ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణలో కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న వేళ భద్రాద్రిలో నిర్వహించే శ్రీరామనవమి వేడుకలను ఈ ఏడాది కూడా నిరాడంబరంగా

Updated : 28 Mar 2021 13:27 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న వేళ భద్రాద్రిలో నిర్వహించే శ్రీరామనవమి వేడుకలను ఈ ఏడాది కూడా నిరాడంబరంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్లతో చర్చించారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతేడాది లాగే పరిమిత సంఖ్యలో భక్తులతో వేడుకలు జరపనున్నట్లు వివరించారు. 

శ్రీరామనవమికి భక్తులు భద్రాద్రికి రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాములోరి కల్యాణానికి సంబంధించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తామన్నారు. సీఎం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాల్లోనూ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని.. ఆలయాలను శానిటైజ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులు సహకరించాలని ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని