Komatireddy: దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావుకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పించారు. 

Updated : 13 Jun 2024 21:15 IST

హైదరాబాద్‌: రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావుకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పించారు. ఫిల్మ్‌సిటీకి వెళ్లి రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్రమశిక్షణకు మారుపేరైన రామోజీరావు.. ప్రజల పక్షాన బలమైన గళం వినిపించారని అన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుబ్బిరామిరెడ్డి కూడా రామోజీరావుకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

దేశం గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయింది: లక్ష్మణ్‌

దివంగత రామోజీరావుకు భాజపా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయిందని లక్ష్మణ్‌ అన్నారు. విలువలతో కూడిన జీవనం సాగించిన రామోజీరావు.. తెలుగు భాష పరిరక్షణకు విశేష కృషి చేశారని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని