Updated : 08 May 2022 15:23 IST

KTR: ఆ విషయాన్ని గంగూలీ, జైషాలను అడగాలి: ‘ఆస్క్‌ కేటీఆర్‌’లో మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణలో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించామని మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో కొత్తగా మూడు టిమ్స్‌ ఆస్పత్రులను నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు వివరించారు. 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకలో సీఎం పదవి అమ్మకం వార్తలు భాజపా నిజస్వరూపమని కేటీఆర్‌ సమాధానాలిచ్చారు. ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో కేటీఆర్‌ ‘ఆస్క్‌ కేటీఆర్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

వచ్చే ఎన్నికల్లోనూ ప్రజా ఆశీర్వాదంతో ప్రగతిని కొనసాగిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాతోపాటు ఇతర పార్టీలు తమకు పోటీనే అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రజల ఆస్తులను అమ్ముకుంటోందని కేటీఆర్‌ అన్నారు. కేంద్రంపై రాష్ట్రాలు కలిసికట్టుగా ప్రజాస్వామ్యంగా పోరాడాలని చెప్పారు. రాజకీయాల్లోకి యువత వచ్చి పట్టుదలగా కష్టపడి పని చేయాలని పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్పారు.

నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలు.. కేటీఆర్‌ సమాధానాలు

ప్రశ్న: హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించడం లేదు?

కేటీఆర్‌: ఆ విషయాన్ని గంగూలీ, జైషాలను అడగాలి.

ప్రశ్న: హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైంది?

కేటీఆర్‌: ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వదు. 

ప్రశ్న: ఆదిలాబాద్ బీడీఎన్‌టీ ల్యాబ్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు?

కేటీఆర్‌: జులైలో ప్రారంభిస్తాం. 

ప్రశ్న: తెరాసను తెలంగాణ వెలుపలకు కూడా విస్తరించాలి.

కేటీఆర్‌: భవిష్యత్తులో ఏం జరగాల్సి ఉందో ఎవరికి తెలుసు?


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని