Updated : 24 Jan 2022 12:01 IST

KTR: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల నీటి సరఫరాకు రూ.6వేల కోట్లు: కేటీఆర్‌

హైదరాబాద్: దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉందని.. హైదరాబాద్‌కు మాత్రమే అన్ని కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 నీటి సరఫరా పనులకు కేటీఆర్‌ ఇవాళ శంకుస్థాపన చేశారు. రూ.587కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఓఆర్‌ఆర్‌ పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు నీటి సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

‘‘హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు ఇప్పటికే నగరంతో కలిసిపోయాయి. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని గ్రామాలను హైదరాబాద్‌లో భాగంగా భావిస్తున్నాం. జీహెచ్‌ఎంసీలో విలీనమైన అన్ని గ్రామాలకు నీరు అందిస్తాం. రూ.1,200 కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్‌ పరిధి ఆవాసాలకు నీటి సరఫరా చేస్తాం. హైదరాబాద్ శివారు ప్రాంతాలకే నీటి సరఫరా కోసం రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొండ పోచమ్మసాగర్‌ నీటితో గండిపేట చెరువును నింపాలనేది సీఎం ఆలోచన’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని నివాసాలకు కొత్త నీటి కనెక్షన్లు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని