KTR: హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి కేటీఆర్‌ ఈ బస్సులను మంగళవారం ప్రారంభించారు.

Updated : 07 Feb 2023 20:21 IST

హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈనెల 11 నుంచి ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, ప్యారడైజ్‌, నిజాం కాలేజీ ప్రాంతాల్లో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 6 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల కోసం హెచ్‌ఎండీఏ ఆర్డర్‌ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మిగిలిన 3 బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. నగరంలో మొత్తం డబుల్‌ డెక్కర్‌ బస్సులు 20కి పెంచాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఒక్కో బస్సును రూ.2.16కోట్లతో కొనుగోలు చేశారు. బస్సులో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులకు సీటింగ్‌ సామర్థ్యం ఉంది. ఒక సారి ఛార్జింగ్‌ చేస్తే 150 కి.మీ ప్రయాణించవచ్చని, 2 నుంచి 2.5 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్‌ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.  ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని