KTR: సింగరేణి జోలికొస్తే కార్మికుల సెగ దిల్లీని తాకుతుంది: కేటీఆర్‌

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సింగరేణికి బొగ్గు గనులు నేరుగా కేటాయించాలని కోరారు.

Updated : 07 Feb 2022 13:11 IST

హైదరాబాద్‌: సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సింగరేణికి బొగ్గు గనులు నేరుగా కేటాయించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి కేటీఆర్‌ లేఖ రాశారు. ‘‘సింగరేణి జోలికొస్తే కార్మికుల సెగ దిల్లీకి తాకుతుంది. ప్రభుత్వ సంస్థలను చంపేసే కుట్రకు భాజపా తెరలేపింది. సింగరేణిని బలహీనపరిచి, నష్టాల సంస్థగా మార్చే కుట్ర చేస్తోంది. నష్టాలు చూపి చివరకు ప్రైవేటుపరం చేయాలని భాజపా పన్నాగం పన్నుతున్నారు.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకూ 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణి కోల్‌మైన్‌ ఉద్యోగాల కల్పనలో గోల్డ్‌మైన్‌. గనులు మూతపడే కొద్దీ ఉద్యోగాలూ పోతాయి. సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది’’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని