Telangana News: నాలా ప్రమాదాలు జరిగితే అధికారులదే బాధ్యత: కేటీఆర్‌

స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ అమలుపై అధికారులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేయాలని

Updated : 08 Feb 2022 16:32 IST

హైదరాబాద్‌: స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ అమలుపై అధికారులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతున్నాయని, నాలాలకు ఫెన్సింగ్‌, రక్షణ గోడ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. నాలా ప్రమాదాలు జరిగితే ఇకపై అధికారులనే బాధ్యులను చేస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు నాలా ప్రమాదాలు జరగకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. నాలాల పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రతివారం సమీక్షించాలని, మేజర్‌ కార్పొరేషన్లలోనూ నాలాలపై రక్షణ చర్యలకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని