Telangana News: హైదరాబాద్‌ ప్రజలకు ఒక అద్భుతమైన చోటుగా గండిపేట: కేటీఆర్‌

చెరువుల సంరక్షణ పైన ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నానక్‌రామ్‌గూడలోని

Published : 20 Feb 2022 01:45 IST

హైదరాబాద్‌: చెరువుల సంరక్షణ పైన ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నానక్‌రామ్‌గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల సంరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ పనులపై చర్చించారు. హెచ్ఎండీఏ ఇప్పటికే అనేక చెరువులను వేగంగా అభివృద్ధి చేస్తోందని.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కలిసి సమన్వయం చేసుకుంటూ చెరువులను అభివృద్ధి చేయాలని కేటీఆర్‌ సూచించారు. గండిపేట సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. నగర ప్రజలకు గండిపేట ఒక అద్భుతమైన చోటుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కట్టుదిట్టమైన భద్రతతో కాపాడే చర్యలు హెచ్‌ఎండీఏ తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని