KTR: సీబీఐపై ప్రధానికే నమ్మకం లేదు.. ప్రజలెందుకు నమ్ముతారు?: కేటీఆర్‌

సీబీఐపై ప్రధాని మోదీకే నమ్మకం లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు గతంలో మోదీ చేసిన ట్వీట్లను ఆయన ట్యాగ్‌ చేశారు.

Updated : 23 Mar 2023 19:02 IST

హైదరాబాద్‌: సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే నమ్మకం లేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధానికే నమ్మకం లేనప్పుడు దేశ ప్రజలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లపై కేటీఆర్‌ పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు సీబీఐ వంటి సంస్థలపై దేశ ప్రజలకు ఎందుకు నమ్మకం లేదంటూ గతంలో మోదీ చేసిన ట్వీట్లను ఆయన ట్యాగ్‌ చేశారు. అలాంటి సీబీఐపై ఇప్పుడు ప్రజలకు నమ్మకం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని