Vijayawada: విజయవాడలో భారీ వర్షం.. పరిశీలించిన మంత్రి నారాయణ

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ రోడ్డులో వర్షం నీరు నిలవ ఉన్న ప్రాంతాన్ని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి పురపాలకశాఖ మంత్రి నారాయణ పరిశీలించారు.

Published : 16 Jun 2024 23:04 IST

విజయవాడ: నగరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ రోడ్డులో వర్షం నీరు నిలవ ఉన్న ప్రాంతాన్ని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి పురపాలకశాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. భవిష్యత్తులో వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అకాల వర్షాలు కురిసినప్పుడు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారులను క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు సూచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు