Niranjan reddy: దశాబ్ది ఉత్సవాలు.. చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
జూన్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు వేదికలను సుందరంగా ముస్తాబు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సచివాయంలో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్: వ్యవసాయ రంగానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత ఉంటుందని.. దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం గర్వకారణమని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వ్యవసాయ శాఖ తరఫున జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలని అధికారులకు మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. జూన్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు వేదికలను సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో నమోదైన విజయాలను తెలియజేసేలా పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు అవి అర్థమయ్యే విధంగా వివరించాలని, రైతు వేదికల్లో పండుగ వాతావరణం కనిపించాలని దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులను మామిడి తోరణాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించి రైతులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ఆయా మార్కెట్ల పరిధిలో నాణ్యమైన పంటలు పండించే ఉత్తమ రైతులను గుర్తించి సత్కరించాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి జరిగిన మేలును యావత్ రైతాంగానికి వివరించాలని అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్ ఎద్దేవా