Andhra News: మార్చి 31 నాటికి 100కు పైగా సబ్‌స్టేషన్లు: మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ కనెక్షన్లను మార్చిలోగా పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అదేవిధంగా మార్చి 31 నాటికి 100కు పైగా సబ్‌స్టేషన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు.

Published : 13 Feb 2023 16:50 IST

అమరావతి: వేసవి దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్‌ కొరతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తెలిపారు. ఈ ఏడాది లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్న మంత్రి.. మార్చిలోగా పెండింగ్‌ కనెక్షన్లు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్‌ సరఫరా, పంపిణీ అంశాలపై సచివాలయంలో జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

అనంతరం సమీక్ష వివరాలను పెద్దిరెడ్డి మీడియాకు వెల్లడించారు. మార్చి 31 నాటికి 100కు పైగా సబ్‌స్టేషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. జగనన్న కాలనీల్లో విద్యుత్‌ కనెక్షన్లు, సరఫరా లైన్లు పూర్తి చేయడానికి సమీక్షలో నిర్ణయం తీసుకున్నామన్నారు. థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. 2-3  నెలలకోసారి బొగ్గు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని