Andhra News: పారదర్శక మైనింగ్ లీజుల కోసం ‘ఇ-ఆక్షన్‌’: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ లీజుల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు ఇ-ఆక్షన్ విధానం అమలులో ఉందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Published : 20 Apr 2022 17:05 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ లీజుల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు ఇ-ఆక్షన్ విధానం అమలులో ఉందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. లీజుల జారీ విషయంలో జాప్యం లేకుండా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గనుల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు వచ్చే విషయంలోనూ ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గనుల లీజు ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఏపీలో 5,146 స్వల్ప ఖనిజాలకు సంబంధించిన లీజులు ఉన్నాయని.. ఇందులో 2,276 లీజులకు మాత్రమే అన్ని రకాల అనుమతులున్నాయని మంత్రి తెలిపారు. మిగతా వాటికి కూడా అన్ని రకాల అనుమతులు తీసుకునే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. గనులు, క్వారీల నుంచి వచ్చే వ్యర్థాలను అటవీ భూముల్లో వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని