అబ్దుల్లాపూర్‌మెట్‌లో పోలీస్‌స్టేషన్‌ భవనానికి శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీస్‌స్టేషన్‌ నూతన భవనానికి మంత్రి సబితా

Updated : 01 Jul 2021 15:38 IST

రామోజీ ఫౌండేషన్‌ సహకారంతో నిర్మాణం

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీస్‌స్టేషన్‌ నూతన భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రామోజీ ఫౌండేషన్‌ సహకారంతో ఈ పోలీస్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సీపీ మహేశ్‌ భగవత్‌ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మంత్రులు సబిత, ఎర్రబెల్లి మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్‌ సహకారానికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

‘‘అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌ 2017లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న భవనం కూడా రామోజీ ఫౌండేషన్ సమకూర్చిందే. నూతన పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ మరోసారి ముందుకు రావడం ఎంతో సంతోషం. 9 వేల చదరపు అడుగులతో నూతన భవనాన్ని ఆధునాతన సౌకర్యాలతో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు’’ అని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని