Hyderabad: బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు.. మంత్రి సబిత ఆదేశాలు
బంజారాహిల్స్‌లో చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్: చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని డీఈవోకు సూచించారు. ఈ వ్యవహారంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని.. అందుకు అనుగుణంగా తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భద్రతా పరమైన చర్యలు ప్రభుత్వానికి సూచించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా వెల్లడించారు. వారం రోజుల్లోగా కమిటీ నివేదిక వస్తుందని.. దాని ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
బంజారాహిల్స్‌లో చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో పాఠశాల ప్రిన్సిపల్‌పై బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న చిన్నారి(4)పై అదే పాఠశాల ప్రిన్సిపల్ వాహన డ్రైవర్ రజనీ కుమార్(34) లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడ్ని మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రిన్సిపల్ గది సమీపంలో ఉండే డిజిటల్ గదిలోనే ఈ తతంగం జరిగినా ప్రిన్సిపల్ ఎస్.మాధవి(56) నిరోధించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఘటన జరగడానికి కారణమయ్యారనే అభియోగాలతో ఆమెపై సెక్షన్ 21 పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి బుధవారం అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, సీఐ నరేందర్‌తో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులిద్దరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం