Telangana News: విషజ్వరాల బారిన విద్యార్థులు.. ఆరోగ్య పరిస్థితి ఆరా తీసిన మంత్రి

ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు విషజ్వరాల బారినపడడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. మూడు రోజుల క్రితం కుంటాల ఆశ్రమ పాఠశాలలో పలువురు విద్యార్థినులు విషజ్వరాల బారిన పడ్డారు.

Published : 20 Aug 2022 00:14 IST

ఆదిలాబాద్‌: ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు విషజ్వరాల బారినపడడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. మూడు రోజుల క్రితం కుంటాల ఆశ్రమ పాఠశాలలో పలువురు విద్యార్థినులు విషజ్వరాల బారిన పడ్డారు. దీంతో అధికారులు వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదిలాబాద్‌ కలెక్టర్‌, అధికారులతో మాట్లాడారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. వసతి గృహంలో ప్రత్యేక వైద్య శిబిర సేవలు కొనసాగించాలని సూచించారు. మూడు రోజుల క్రితం విషజ్వరం బారిన పడి చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని గురువారం మృతిచెందింది. ఫకీర్‌నాయక్‌ తండాకు చెందిన విద్యార్థి మృతి చెందడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. కుంటాల పాఠశాలలో వాటర్‌ ప్లాంట్‌ను తక్షణమే మర్చాలని ఆదేశాలు జారీచేశారు. సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి దృష్ట్యా పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. భోజనాలు వడ్డించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని